తల్లాడ పట్టణంలోని కొత్తగూడెం రూట్లో మల్లవరం రోడ్డులో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ పైపులు లీకేజీ అవ్వడంతో నీరు వృధాగా పోతోంది. దీనివల్ల రోడ్డుపై వెళ్లేవారు, చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.