సత్తుపల్లిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు

1066చూసినవారు
సత్తుపల్లిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బట్ట రాగమయి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, AMC చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్