ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని మదర్ తెరిస్సా టెక్నో స్కూల్‌లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు, పాఠశాల చిన్నారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి బోగి మంటలు వద్ద కోలాటం, పాటల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.