పెనుబల్లి: రోడ్డు ప్రమాద హాట్‌స్పాట్లను పరిశీలించిన ఏసీపీ

0చూసినవారు
పెనుబల్లి: రోడ్డు ప్రమాద హాట్‌స్పాట్లను పరిశీలించిన ఏసీపీ
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా, మంగళవారం కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ పెనుబల్లి మండలం వి. ఎం. బంజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదాలు తరచుగా జరిగే హాట్‌స్పాట్లను సందర్శించారు. రింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌ను పరిశీలించి, గ్రీన్ ఫీల్డ్ హైవే వైపు వెళ్లే వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, రోడ్లు స్పష్టంగా కనిపించేలా ఇరువైపులా ఉన్న చెట్ల పొదలను తొలగించే పనులు చేపట్టారు.

ట్యాగ్స్ :