పెనుబల్లి మండలం గణేశునిపాడు వద్ద ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం సేవించి, మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వాహనం నడపడమే కారణమని తెలుస్తోంది. విద్యార్థుల ఆరోపణల ప్రకారం, ఈ నిర్లక్ష్యం వల్లే బస్సు కాలువలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.