పెనుబల్లిలో ఐకేపీ వీఓఏ సిబ్బంది చేస్తున్న సమ్మె బుధవారం కూడా కొనసాగింది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమ్మెకు మద్దతు తెలిపారు. వీఓఏలకు నెలకు రూ. 26వేలు కనీస వేతనం, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్, ఆరోగ్య బీమా పాలసీ వంటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏ ఉద్యోగి కూడా ప్రశాంతంగా లేదని ఆయన పేర్కొన్నారు.