పెనుబల్లి: రామాలయంలోకి దూసుకెళ్లిన లారీ

71చూసినవారు
పెనుబల్లి: రామాలయంలోకి దూసుకెళ్లిన లారీ
లారీ అదుపుతప్పి పెనుబల్లి మండలంలోని లంకపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రామాలయంలోకి దూసుకెళ్లిన ఘటన శనివారం రాత్రి జరిగింది. సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆలయంలో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో రామాలయం దెబ్బతినగా, లారీ డ్రైవర్ శ్యామ్ సింగ్, క్లీనర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. దీంతో పోలీసులు చేరుకుని క్యాబిన్ లో వారిద్దరిని బయటకు తీసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్