ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఆదివారం పెనుబల్లి మండల పరిధిలోని మత్తుగూడెంలో కర్నాటి భూమారెడ్డి మామిడితోటలో మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం వృక్ష ప్రేమికుడు వనజీవి రామయ్య మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.