కాల్ సెంటర్ల పేరుతో అమాయకులను మోసం చేసి రూ. 547 కోట్లు కొల్లగొట్టిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పెనుబల్లి పోలీస్ స్టేషన్లో సీపీ సునీల్ దత్ వివరాలు వెల్లడిస్తూ, ఈ ముఠా విదేశీ సైబర్ నేరగాళ్లతో కలిసి మోసాలకు పాల్పడిందని తెలిపారు. 17 మందిని అరెస్ట్ చేయగా, వారి నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఆస్తులను జప్తు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.