పెనుబల్లి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి

80చూసినవారు
పెనుబల్లి: చికిత్స పొందుతూ విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. పెనుబల్లి మండలం చౌడవరం గ్రామానికి చెందిన విద్యార్థి వీఎం. బంజర్ జెడ్పీహెచ్ఎస్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం పాఠశాల నుండి సైకిల్ పై ఇంటికి వస్తుండగా పెనుబల్లి ఆర్యవైశ్య కల్యాణ మండపం వద్ద లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలవడంతో హైదరాబాద్ తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు.