ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్సై

13చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..  ఎస్సై
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని తల్లాడ మండలంలో ఈదురుగాలిలతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వెంకటకృష్ణ గురువారం సూచించారు. మత్స్యకారులు వాగులు, చెరువులు, కాలువల్లో చేపల వేటకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆయన హెచ్చరించారు. వరదలు, ఇతర విపత్తులు సంభవిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్