మల్లవరం గ్రామంలో గ్రామ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.