
కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్నా రూ.2560 జరిమానా.. రైల్వే కొత్త నిబంధన!
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన నిబంధనను గుర్తుచేసింది. కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్నప్పటికీ, టికెట్ బుక్ చేసుకున్న బోర్డింగ్ పాయింట్ నుండి రైలు ఎక్కకపోతే భారీ జరిమానా పడుతుంది. రాజస్థాన్‌లోని రైకా బాగ్ జంక్షన్ నుండి టికెట్ బుక్ చేసుకున్న ఒక మహిళ, పాలి మార్వార్ స్టేషన్ నుండి రైలు ఎక్కడంతో రూ.2560 జరిమానా చెల్లించాల్సి వచ్చింది. రైల్వే నిబంధనల ప్రకారం, బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవాలనుకుంటే చార్ట్ సిద్ధం చేయడానికి ముందే, రైలు బయలుదేరడానికి కనీసం అరగంట ముందు IRCTC వెబ్‌సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్ ద్వారా మార్చుకోవాలి. లేదంటే సీటును 'నాట్ టర్న్డ్ అప్' గా పరిగణించి, వేరే ప్రయాణికులకు కేటాయించడంతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.




