ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో, సుమారు 2.50 కోట్ల రూపాయల వ్యయంతో వేశ్యకాంతుల చెరువు పునరుద్ధరణ పనులను
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులుతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్టోన్ పిచ్చింగ్, స్టీల్ రైలింగ్, జంగిల్ క్లియరింగ్, కట్ట మరమ్మత్తులు, బతకమ్మ ఘాట్ నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.