హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తన నియోజకవర్గ సమస్యలను వివరించారు. దీనికి స్పందించిన ప్రభుత్వం, సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రూ. 5 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.