అన్నారుగూడెం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

1061చూసినవారు
అన్నారుగూడెం లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్
ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని అన్నారుగూడెం గ్రామంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది శనివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్ దీనిని ప్రారంభించారు. పోలియో మహమ్మారిని శాశ్వతంగా నిలువరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్‌లు, అధికారిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నాయని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్