సత్తుపల్లి: 22 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో సీపీఎం

8చూసినవారు
సత్తుపల్లి: 22 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో సీపీఎం
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం సంయుక్తంగా పోటీ చేస్తున్నాయని తెలిపారు. మొత్తం 23 వార్డుల్లో 22 వార్డుల్లో బీఆర్ఎస్, ఒక వార్డులో సీపీఎం అభ్యర్థి బరిలో ఉన్నారని వివరించారు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చామని, నామినేషన్ ఉపసంహరించుకున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్