ఓటు చోరీ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ణి వీరంరాజు తీవ్రంగా ఖండించారు. ఆదివారం సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సత్తుపల్లిలో కొంతమంది ఓటు చోరీపై సంతకాల సేకరణ చేస్తున్నారని, అసలు ఓటు దొంగతనం ఎప్పుడు జరిగిందని ప్రశ్నించారు. గతంలో గాంధీ వారసత్వాన్ని దొంగిలించింది ఎవరు అని, అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనలోనే నడుస్తుందని విమర్శించారు.