సత్తుపల్లి: వాడపల్లికి ప్రతి శుక్రవారం డీలక్స్ బస్సు

5చూసినవారు
సత్తుపల్లి: వాడపల్లికి ప్రతి శుక్రవారం డీలక్స్ బస్సు
సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు సత్తుపల్లి డిపో నుండి ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రమైన వాడపల్లికి ప్రత్యేక డీలక్స్ బస్సు ఏర్పాటు చేశారు. ఈ బస్సు వాడపల్లి చేరుకున్నాక, దర్శనానంతరం ఉదయం 8 గంటలకు వాడపల్లి నుండి తిరిగి బయలుదేరుతుంది. మరిన్ని వివరాల కోసం 9866619189, 9550767375, 9959225962 నంబర్లను సంప్రదించవచ్చు.