సత్తుపల్లి గాంధీనగర్‌లో బుధవారం బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ తడికమళ్ల వరలక్ష్మీతో పాటు మరో 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మట్టా రాగమయి, డాక్టర్ మట్టా దయానంద్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.