సత్తుపల్లి: ఇల్లు దగ్ధం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు

0చూసినవారు
సత్తుపల్లి: ఇల్లు దగ్ధం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు
సత్తుపల్లి పట్టణం వెంగళరావు కాలనీలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన ఘటనపై ఎమ్మెల్యే మట్ట రాగమయి స్పందించారు. సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి ఎమ్మెల్యే నిత్యవసర సరుకులు, బియ్యం, దుప్పట్లు, నగదును అందజేసి భరోసా కల్పించారు. అలాగే స్థానిక తహశీల్దార్ తో మాట్లాడి బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్