సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన తండ్రీకొడుకులు పుసులూరి హనుమంత్, గుణ వెంకట సాయికుమార్ బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో వారు గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీని బలోపేతం చేయడానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు ప్రకటించారు.