సత్తుపల్లి: గిరిజన మహిళలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు

4చూసినవారు
సత్తుపల్లి: గిరిజన మహిళలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు
పిఓడబ్ల్యు రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ శనివారం సత్తుపల్లి మండలం గుడిపాడులో మాట్లాడుతూ, గిరిజన మహిళలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని అన్నారు. గుడిపాడు గిరిజనులు 25 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నా, వారికి పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు మహిళలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :