సత్తుపల్లి: 25 మందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1చూసినవారు
గురువారం సత్తుపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వేంసూర్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మాణిక్ రావు, ఆర్ఐలు పి. ప్రసన్నకుమార్, పి. లక్ష్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.