సత్తుపల్లి పట్టణం వెంగళరావు నగర్ లో సింగరేణి నిధులు రూ. 17 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్, బస్ షెల్టర్ పనులకు శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారిని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.