శుక్రవారం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని పరిశీలించి, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.