సత్తుపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న వాచ్మన్, పేషంట్ కేర్ పారిశుద్ధ్య కార్మికులకు గత ఐదు నెలలుగా వేతనాలు అందించట్లేదని, వారి సమస్యలని పరిష్కరించాలని హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వరని వినతి పత్రం ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు తడికమల్ల యోబు పాల్గొని మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం ఆసుపత్రి కార్మికులకు పెండింగ్ వేతనాలను చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.