సత్తుపల్లి: సైలోబంకర్ బాధితుల సమస్యలపై స్పందించాలి

85చూసినవారు
సత్తుపల్లి: సైలోబంకర్ బాధితుల సమస్యలపై స్పందించాలి
సత్తుపల్లి పట్టణం కిష్టారం అంబేద్కర్ నగర్ వాసులు సింగరేణి సైలోబంకర్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ గ్రామానికి సమీపంలో నిర్మించిన ఈ సైలోబంకర్ నుంచి వెలువడే దుమ్మూధూళి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

సంబంధిత పోస్ట్