సత్తుపల్లి: శబరిమలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు

2చూసినవారు
సత్తుపల్లి: శబరిమలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి శబరిమలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఊటుకూరు సునీత తెలిపారు. సత్తుపల్లిలో శబరిమల యాత్రకు సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించారు. కార్తీక మాసంలో అన్నవరం, పంచరామాలకు కూడా డీలక్స్ బస్సులు నడుపుతున్నట్లు ఆమె చెప్పారు. మరిన్ని వివరాల కోసం 98666 19189, 95507 67375 నెంబర్లను సంప్రదించాలని డీఎం కోరారు.

సంబంధిత పోస్ట్