సత్తుపల్లి: ఈతకు వెళ్లి ఇద్దరు బాలుర గల్లంతు

0చూసినవారు
సత్తుపల్లి పట్టణ శివారులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు క్వారీ గుంతలో గల్లంతయ్యారు. ఆదివారం మధ్యాహ్నం మెట్టాంజనేయస్వామి ఆలయం వద్ద ఈతకు దిగిన ఎన్టీఆర్ కాలనీకి చెందిన శివ(13), నాగబాబు(14) లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్