సత్తుపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

1చూసినవారు
సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నాచారానికి చెందిన వేముల మారేష్, తగరం హరికృష్ణ అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రింగ్ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా, ఇంజిన్ నుంచి పొగ రావడంతో వాహనం దిగి పరిశీలిస్తున్న సమయంలో అతివేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో గాయపడిన యువకులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్