
యుద్ధం పేరిట డిజిటల్ మాయాజాలం: 90% వీడియోలు AI సృష్టి!
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండగా, సోషల్ మీడియాలో 'డిజిటల్ యుద్ధం' నడుస్తోంది. పేలుళ్లు, క్షిపణి దాడుల వీడియోల్లో 90% AI ద్వారా సృష్టించినవేనని నిపుణులు అంటున్నారు. లైకులు, షేర్ల కోసం డబ్బు ఆశతో కొందరు తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని వివరించారు. ఇరాన్లో ఇంటర్నెట్ లేకపోయినా అక్కడి దాడుల వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తుండటం దీనికి నిదర్శనం. భారత ప్రభుత్వం యుద్ధ వార్తలను ప్రచురించేటప్పుడు, షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అధికారిక సమాచారం లేకుండా దేనినీ నమ్మవద్దని హెచ్చరించింది.




