బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ, రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.