సత్తుపల్లి: బెటాలియన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

5చూసినవారు
సత్తుపల్లి మండలం గంగారం 15వ ప్రత్యేక బెటాలియన్ లో వార్షిక క్రీడాపోటీలు ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ధనసరి సీతక్క మాట్లాడారు. బెటాలియన్ ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసుకుని వస్తే పదోన్నతులు, బదిలీలు, ఇతర సమస్యలపై చర్చిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్