ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వైయస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర
కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం, పట్టణ నేతలు కూడా పాల్గొన్నారు.