కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి పిలుపునిచ్చారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో మంగళవారం జరిగిన మండల మహాసభలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో పాండు, విఠల్ రావు, సత్యనారాయణ, రమణారెడ్డి, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.