వ్యవస్థలోని దోపిడీ, దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన బత్తుల వెంకటేశ్వరరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తెలిపారు. సత్తుపల్లిలో శనివారం జరిగిన సమావేశంలో శివలింగం రచించిన 'విప్లవోద్యమ తొలికిరణం త్యాగాల జీవితం బత్తుల వెంకటేశ్వరరావు జీవన రేఖలు'పుస్తకాన్ని ఆవిష్కరించారు. నక్సల్బరీ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన బత్తుల ఆశయాలు స్ఫూర్తిదాయమకమని పేర్కొన్నారు.