ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు చెరువులో బుధవారం భారీ స్థాయిలో చేపల వేట జరిగింది. సుమారు 50 టన్నుల చేపలను పట్టాలనే లక్ష్యంతో సొసైటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలు పట్టే వారిని రప్పించారు. చేపల తరలింపునకు భారీ క్రేన్, రెండు కంటైనర్లు, ఐషర్ వాహనాలను ఉపయోగించారు. చేపలు పడుతున్నారన్న సమాచారంతో తుమ్మూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు.