సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఏజెన్సీ మండలాలకు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు అవునూరి మధు డిమాండ్ చేశారు. శనివారం న్యూడెమోక్రసీ ఆద్వర్యంలో సత్తుపల్లిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బుగ్గపాడు-నాగుపల్లి గ్రామాలలోని ప్రభుత్వ భూములను పేద ప్రజలకు పంచాలని. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అర్హులందరికీ రైతుభరోసా, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.