వచ్చే వర్షాకాలంలో రైతుల పంటసాగుకు ఎదురయ్యే ఆటంకాలను తొలగించాలని నీటి పారుదల శాఖ ఎస్ఈ వాసంతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్ద చెరువు, లెఫ్ట్ కెనాల్, రేజర్లలోని ఎస్ఆర్ ఎల్ఐపీ ప్యాకేజీ నంబర్ 6 పరిధిలోని
ఎన్టీఆర్ కెనాల్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని డీఈఈలను ఆదేశించారు.