తల్లాడ మండలం పినపాక గ్రామంలో శ్రీ పార్వతీ సమేత సోమలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం శ్రీనివాసరావు,
కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.