మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తల్లాడ మండలంలోని 27 పంచాయతీలకు తొమ్మిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. అన్నారుగూడెం, మల్లారం, బిల్లుపాడు, కుర్నవల్లి, నూతనకల్, మిట్టపల్లి, పినపాక, రంగంబంజర, తల్లాడ పంచాయతీ కార్యాలయాల్లో ఈ కేంద్రాలు కొలువుదీరనున్నాయి.