ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని కల్లూరు RDO రాజేందర్ అన్నారు. బుధవారం తల్లాడ మండల పరిధిలోని కలకోడిమ, బిల్లుపాడు గ్రామాలలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను బట్టి ప్రతి సోమవారం బిల్లులు మంజూరవుతాయని వివరించారు. అనంతరం మండల, బూత్ లెవెల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో MPDO సురేష్ బాబు ఉన్నారు.