తల్లాడ: వర్కర్లకు ప్రతీనెల రూ. 10 వేలు ఇవ్వాలి

1128చూసినవారు
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తెనపల్లి విజయలక్ష్మి, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు ప్రతీనెల రూ. 10 వేలు గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తల్లాడలో శనివారం జరిగిన యూనియన్ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 54వేల మంది వర్కర్లకు నెల నెలా రూ. 10వేలు చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్