గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, టాస్క్ ఫోర్స్ బృందాలు కొణిజర్ల, రఘునాదపాలెం, చింతకాని, VM బంజారా గ్రామాలలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించాయి. టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో సుమారు 35 వేల రూపాయల విలువైన IMFL మద్యం 30 లీటర్లు, 8.4 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక దాడులు జరిగాయి.