పేదల సొంతింటి కలను సాకారం చేయడమే
కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల్లాడ మండలం పెనపాక గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి పంపిణీ చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, పట్టణ
కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.