ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వేశ్యకాంతల చెరువు పొంగిపొర్లడంతో దిగువ ప్రాంతాలు బుధవారం జలమయమయ్యాయి. వరద నీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రెండో అంతస్తు వరకు చేరడంతో పంట పొలాలు, నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ వెంటనే స్పందించి, రాత్రంతా వరద ప్రాంతంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. లారీలు, ట్రాక్టర్ల సాయంతో వరదలో చిక్కుకున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టారు.