ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామం నుండి సత్తుపల్లికి వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మృతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ వాసులుగా గుర్తించారు. ఈ సంఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.