సెప్టెంబర్ 6న ఖమ్మం పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న TUCI తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్‌కు ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని TUCI ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి డి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం తల్లాడలో జనరల్ కౌన్సిల్ ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలు, కార్మిక హక్కుల పరిరక్షణ, భవిష్యత్ పోరాటాలపై కౌన్సిల్‌లో చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో షేక్ లాల్మియా, కిషోర్, వెంకటేశ్వర్లు, నారాయణ, యూసుఫ్, బిక్షం, విష్ణు, పుల్లయ్య, అనిల్, రమణ, రాఘవ తదితరులు పాల్గొన్నారు.