ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని తల్లాడ తహసీల్దార్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. పేదల భూమి, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఐలమ్మ స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, కార్యాలయ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.